కుటుంబంలో చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పథకం లబ్ధి అందిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పథకం అమలుకు విధివిధానాలను ఖరారు చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించేందుకు.. కొత్త నిబంధనలను తీసుకొచ్చిందని అన్నారు. అది కూడా 15 వేలు కాకుండా.. రూ.13 వేలే ఇచ్చిందని… ఇలాంటి లోపాలు లేకుండా పథకాన్ని అమలు చేయడానికి మంత్రులు, నిపుణులతో చర్చిస్తామని పేర్కొన్నారు.