YCP MLC Candidates List: ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను వైసీపీ ప్రకటించింది. మొత్తం 18 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. 11 మంది బీసీలకు ఎమ్మెల్సీ అభ్యర్థులగా అవకాశం కల్పించామని తెలిపారు. బీసీలకు వైసీపీ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని.. బ్యాక్ బోన్ అని సజ్జల వెల్లడించారు. స్థానిక సంస్థల కోటా కింద తొమ్మిది మంది, ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరి పేర్లను ప్రకటించారు. స్థానిక సంస్థల కోటాలో సత్తు రామారావు, కుడుపూడి సూర్యనారాయణ, వంకా రవీంద్రనాథ్, కవురు శ్రీనివాస్, మేరుగ మురళి, సిపాయి సుబ్రహ్మణ్యం, రామసుబ్బారెడ్డి, డా. మధుసూదన్, మంగమ్మ ఉన్నారు. ఎమ్మెల్యే కోటాలో పోతుల సునీత, సూర్యనారాయణ, కోలా గురువులు, బొమ్మి ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగళ వెంకటరమణ, ఏసు రత్నం.. గవర్నర్ కోటాలో కుంభా రవి, కర్రి పద్మశ్రీ పేర్లు ఉన్నాయి.