Site icon Swatantra Tv

ఉసేన్ బోల్ట్ ఖాతా నుంచి రూ.103 కోట్లు మాయం

జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌కు షాక్ తగిలింది. ఆయన ఖాతా నుంచి ఏకంగా నూట మూడు కోట్ల రూపాయల నగదు మాయమైంది. జమైకాకు చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ సంస్థలో ఉసేన్ బోల్ట్ ఈ సొమ్మును దాచాడు. అయితే, స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి ఒకరు.. ఆర్థిక మోసానికి పాల్పడినట్లు సమాచారం. కాగా, పదిరోజుల్లోగా మాయమైన సొమ్మును తిరిగి ఉసేన్ బోల్ట్ అకౌంట్‌లో జమ చేయాలని ఆ కంపెనీ యాజమాన్యాన్ని బోల్ట్‌ తరపు న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఉసేన్ బోల్ట్ అకౌంట్ నుంచి సొమ్ములు మాయం అయిన సంఘటనపై జమైకా ఆర్థిక మంత్రి నిగెల్ క్లార్క్‌ స్పందించారు. ఆర్థిక మోసానికి పాల్పడిన కంపెనీ మాజీ ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Exit mobile version