Site icon Swatantra Tv

నేటి నుంచి ప్రచార బరిలోకి జనసేనాని

   ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. సీఎం జగన్‌ మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర సాగిస్తుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌చ ఇప్పటికే వారాహి యాత్ర పేరుతో గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటించనున్నారు. ఇవాళ పిఠాపురంలో టీడీపీ అంతర్గత సమావేశంలో పాల్గొని, అనంతరం రాజానగరంలో నిర్వహించే బహిరంగ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు.

  రేపు భీమవరం, నర్సాపురం, 22న తాడేపల్లిగూడెం, ఉంగుటూరు ప్రచార సభల్లో పాల్గొంటారు జనసేనాని. ఈ నెల 23న పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్‌ కల్యాణ్‌ నామినేషన్‌ వేస్తారు. అనంతరం ఉప్పాడ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 24న రాజంపేట, రైల్వే కోడూరులో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ప్రచారం చేస్తారు. ఈ నెల 26న రాజోలు, రామచంద్రాపురం, 27న పెద్దాపురం, కాకినాడ గ్రామీణం, 28న జగ్గంపేట, ప్రత్తిపాడులో ప్రచారం చేస్తారు. 29న తిరుపతి, 30న పోలవరం నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల తరఫున ప్రచార సభలు నిర్వహిస్తారు పవన్ కల్యాణ్.

  ఏప్రిల్‌ 1న యలమంచిలి, పెందుర్తి, 2న విశాఖ దక్షిణం స్థానాల్లో పర్యటిస్తారు. 3న నెల్లిమర్ల, పాలకొండ, 4న తుని, పిఠాపురం, 5న గుడివాడ, పామర్రు, 6న రేపల్లే, అవనిగడ్డ, 7న గన్నవరం, పెనమలూరు ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. 10న పిఠాపురంలో మరోసారి రోడ్డు షోలో పాల్గొని, అనంతరం సభలో ప్రసంగిస్తారు. ప్రచారం చివరి రోజైన 11న కాకినాడ గ్రామీణంలో రోడ్డు షో నిర్వహిస్తారు పవన్‌ కళ్యాణ్‌.

Exit mobile version