Site icon Swatantra Tv

Robots layoff | మనుషులే కాదు రోబోలను కూడా వదలని గూగుల్

Robots layoff

Robots layoff | ఓ వైపు ప్రముఖ MNC కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుంటే.. సెర్చింజన్ సంస్థ గూగుల్(Google) మాత్రం రోబో(Robot)లను కూడా వదలడం లేదు. ఇటీవల 12వందల మంది ఉద్యోగులను తొలగించిన గూగుల్.. తాజాగా తమ కంపెనీల క్యాంటీన్లలో సేవలందిస్తున్న రోబోలకు కూడా లేఆఫ్(Layoff) ప్రకటించింది. క్యాంటీన్ల టేబుళ్లను ఇవి శుభ్రం చేస్తూ ఉంటాయి. అయితే వీటిని అభివఈద్ధి చేసే ‘ఎవ్రీ డే రోబోట్స్’ ప్రాజెక్టును గూగుల్ మాత ఈసంస్థ ఆల్ఫాబెట్(Alphabet) మూసివేసింది. ఈ ప్రాజెక్టులో 200మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కరోనా సమయంలో రోబోలు విశేష సేవలు అందించాయి. ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగానే రోబోలను(Robots layoff) ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.

Read Also: పదకొండేళ్ల వయసులో నెలకు కోటి రూపాయల జీతం
Exit mobile version