భారతీయుల గుండె జబ్బుల గురించి గుండె గుబేలుమనే వార్త చెప్పింది ఓ సర్వే. ప్రపంచంలోని అన్ని దేశాల కంటే.. మన ఇండియన్స్‌కే హాట్‌కి సంబంధించి వ్యాధులు ఎక్కవని తేల్చింది. గత 30 ఏళ్లుగా దేశంలో గుండె జబ్బుల మరణాలు రెట్టింపు అయ్యాయని హెచ్చరించింది అసోసియేషన్ ఆఫ్ ఫిజీషి యన్స్ ఆఫ్ ఇండియా.
ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా హాట్ ఎటాక్‌తో మరణిస్తున్న వారి సంఖ్య మన దేశంలో అధికమైంది. అయితే,.. మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జన్యుక్రమంతో పశ్చిమ దేశాల వారి కంటే పదేళ్లు ముందుగానే భారతీయులు గుండె సంబంధింత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఏపీఐ. మిగతా వారితో పోలిస్తే కొరొనరీ ఆర్టెరీ డిసీజ్ వంటి గుండె జబ్బులతో భారతీ యులు మరణించే ప్రమాదం 20-50 శాతం మేర ఎక్కువగా ఉన్నదని ఏపీఐ అధ్యక్షుడు డాక్టర్ మిలింద్ వై నాడ్కర్ తెలిపారు. గత 30 ఏండ్లలో గుండె సంబంధిత మరణాలు దేశంలో రెట్టింపయ్యా యన్నారు. చెడు కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని అమితంగా తీసుకోవడం, జన్యుక్రమం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానానికి బానిసలవ్వడం వంటి కారణాలతో పశ్చిమ దేశాల వారితో పోలిస్తే, భారతీయుల్లో గుండెజబ్బులు పదేండ్ల ముందుగానే వస్తున్నట్టు ఢిల్లీలోని అపోలో దవాఖాన వైద్యుడు డాక్టర్ ముకేశ్ గోయల్ తెలిపారు. ఈ అలవాట్ల వల్లే యువత కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నా రని వెల్లడించారు. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2022 ఒక్క ఏడాదిలోనే భారత్‌లో గుండె పోటుతో 32,457 మంది మరణించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 12.5 శాతం ఎక్కువ. కాబట్టి ఇకనైనా ఆరోగ్యంపై దృష్టి సారించి గుండెను పదిలంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.