Site icon Swatantra Tv

రిషిసునాక్ కుమార్తె కూచిపూడి నృత్యం

ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్న 9 ఏళ్ల అనుష్క. హాజరైన రిషి సునాక్, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి దంపతులు
బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ కుమార్తె అనుష్క సునాక్ బ్రిటన్‌లో కూచిపూడి నృత్యం ప్రదర్శించింది. రంగ్  పేరుతో…నిర్వహించిన  ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ 2022 లో.. 9 ఏళ్ల అనుష్క నృత్యం చేసింది. 

నాలుగేళ్ల చిన్నారుల నుంచి 85 ఏళ్ల  వయోవృద్ధుల వరకూ.. పలువురు కళాకారులు ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. పోలెండ్ లోని నటరంగ్ గ్రూప్ బర్సరీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుష్క తల్లి అక్షత.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె. నారాయణ మూర్తి దంపతులు, రిషి సునాక్ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Exit mobile version