Site icon Swatantra Tv

Revanth Reddy |ఈటల ఇలాకాలో రేవంత్ పర్యటన.. ఆ విషయాలపై ఫోకస్

Revanth Reddy

Revanth Reddy |మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) ఇలాకా హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇసుక అక్రమ తవ్వకాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరా తీశారు. జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ఇసుకు క్వారీలను ఆయన సందర్శించారు. ఎన్ని అడుగుల లోతులో ఇసుక తవ్వకాలు జరపుతున్నారనే దానిపై రైతులను అడిగి తెలుసుకున్నారు.

ఈ క్రమంలో రైతులు తమ బాధలను ఆయనతో పంచుకున్నారు. అంతకుముందు పాదయాత్రలో భాగంగా ఇల్లందకుంట మండలం చేరుకున్న రేవంత్ కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.

అనంతరం సీతారామచంద్ర ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రోత్సవాలు, మేల వాయిద్యాలతో రేవంత్ కు స్వాగతం పలికిన అర్చకులు శాలువాతో సత్కరించి వేదఅశ్వీరచనాలు చేశారు. రేవంత్ తో పాటు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు కావంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

Read Also: పోనీలే పాము కదా! అని కాపాడితే… బుసలు కొట్టింది!

Exit mobile version