Site icon Swatantra Tv

నేడు అలంపూర్‌, గద్వాల్‌, మక్తల్‌లో రేవంత్‌రెడ్డి బహిరంగ సభలు

Revanth Reddy

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు సాగిస్తోంది. విజయ భేరి బస్సు యాత్ర, బహిరంగ సమావేశాలు, సభలు, రోడ్​ షోలతో ప్రజల్లోకి వెళ్తోంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను కూడా ప్రకటించడంతో ప్రచారంపై ఫుల్ ఫోకస్ పెట్టడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇవాళ ఉమ్మడి పాలమూరు జిల్లాలో రేవంత్‌ రెడ్డి ప్రచారంలో పాల్గొననున్నారు. అలంపూర్‌, గద్వాల, మక్తల్‌ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో అలంపూర్‌ వెళ్తారు. అక్కడ అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలంపూర్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు గద్వాల బహిరంగసభలో రేవంత్ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు మక్తల్ లో నిర్వహించనున్న సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.

Exit mobile version