Site icon Swatantra Tv

మహారాష్ట్రలో రేవంత్‌ రెడ్డి దూకుడు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌ రెడ్డి దూకుడు పెంచారు. మహా వికాస్‌ అఘాడీ తరపున ఆయన మూడు రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ మూడో రోజు పుణె, కొల్హాపూర్‌లో క్యాంపెయిన్‌లో పాల్గొంటారు. తెలుగు మాట్లాడే ప్రజల ఓట్లపై ప్రధానంగా ఫోకస్ చేశారు. తెలంగాణ సంక్షేమ మోడల్ చూపుతూ ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. మహాయుతి కూటమి టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, శిండే, అజిత్‌ పవార్‌లపై రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే తాము తెలంగాణలో 50వేల ఉద్యోగాలు ఇచ్చామని.. గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాదిలోగా అన్ని ఉద్యోగాలిచ్చిందో లేదో మోదీ సమాధానం చెప్పాలన్నారు.

గత మూడు రోజులుగా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న రేవంత్‌ రెడ్డి.. సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ముంబై నుంచి హైదరాబాద్‌కు వస్తారు. ఇవాళ్టితో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ప్రధానంగా మహా వికాస్‌ అఘాడీ, మహాయుతి కూటమి మధ్య పోటీ నెలకొంది. సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. ఈనెల 20న ఒకేదశలో పోలింగ్‌ జరగనుంది. 23న ఫలితాలు వెలువడతాయి.

Exit mobile version