Site icon Swatantra Tv

రామోజీ అంత్యక్రియలు రేపు

మీడియా మొఘల్‌, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. రేపు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించను న్నారు. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులర్పించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకుం టున్నారు. ఆయనతో ఉన్న అనుంబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

రామోజీరావు తెల్లవారుజామున కన్నుమూశారు. ఈనెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తెల్లవారు జామున 4 గంటల 50 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ సహా రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావుతో తమకున్న బంధాన్ని గుర్తుచేసుకుంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నివాళులర్పించారు. మీడియా, సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

Exit mobile version