Site icon Swatantra Tv

రామేశ్వరం కేఫ్ పేలుడు …. నిందితుడిని అరెస్టు

       బెంగళూరులో రామేశ్వరం కేఫ్ పేలుడు కేసుతో సంబంధమున్న ఓ వ్యక్తిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. కర్ణాటకలోని బళ్లారిలో బుధవారం షబ్బీర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మార్చి 1వ తేదీన బెంగళూరులో వైట్ ఫీల్డ్ ప్రాంతంలో ఉన్న రామేశ్వరం కేఫ్ లో పేలుడు జరిగింది. ఓ వ్యక్తి బ్యాగులో ఎల్ఇడి తీసుకువచ్చి కేఫ్ వద్ద ఉంచి బ్లాస్ట్ చేశాడు. ఈ ఘటనలో 10మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు పాల్పడిన నిందితుడిని పట్టుకునేందుకు అధికారులు గ్రూపులుగా విడిపోయి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. పలు ప్రదేశాల్లోని సిసిటివిలో రికార్డు అయిన నిందితుడి ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో పేలుడు ఘటనతో సంబంధమున్న ఒకరిని అరెస్టు చేసినట్లు ఎన్ఐఎ వర్గాలు వెల్లడించాయి.

 

Exit mobile version