Site icon Swatantra Tv

నకిలీ విత్తనాల అక్రమ రవాణాపై రామగుండం టాస్క్‌ఫోర్స్ దాడులు

    కల్తీ, నకిలీ విత్తనాల అక్రమ రవాణాను నిర్మూలించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ సీపీ టాస్క్‌ ఫోర్స్ వరుస దాడులు చేపట్టారు. అన్నదాతకు అండగా నిలవడమే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. సీపీ టాస్క్‌ఫోర్స్ ఇనస్పెక్టర్ సంజయ్, ఎస్సై ఉపేందర్, భీమారం ఎస్సై రాములు, భీమారం వ్యవసాయ అధికారి మార్క్ గ్లాడ్‌స్టన్, టాస్క్‌ఫోర్స్ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. మంచిర్యాల జిల్లాలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆవడం ఎక్స్‌రోడ్డు వద్ద క్వింటాల్ 7 కిలోల బీటీ నకిలీ పత్తివిత్తనాలను వారు పట్టుకున్నారు. నిందితుడిని భీమారం పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు.

Exit mobile version