Site icon Swatantra Tv

ఎన్టీఆర్ నో చెప్పిన స్టోరీకి చరణ్ ఎస్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబుతో సినిమా చేయనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ.. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్.. బుచ్చిబాబుకు నో చెప్పాడని.. దీంతో బుచ్చిబాబు చరణ్‌ కి కథ చెప్పడం.. ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అవ్వడం జరిగిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ.. చరణ్‌, బుచ్చిబాబుల ప్రాజెక్ట్ నిజంగా కన్ ఫర్మ్ అయ్యిందా..?

ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. ఆచార్య సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో కొరటాలను కథలో మార్పులు చేర్పులు చేయమని చెప్పారు. అప్పటి నుంచి కొరటాల కథ పై కసరత్తు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి అంతా సెట్ అయ్యింది. అతి త్వరలో ఎన్టీఆర్, కొరటాల మూవీ సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన బుచ్చిబాబుతో కూడా సినిమా చేయాలి అనుకున్నారు. కథ విని ఓకే చెప్పారు. దీంతో బుచ్చిబాబు ఎన్టీఆర్ కోసం గత రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నాడు.

Exit mobile version