Site icon Swatantra Tv

వయనాడ్ సెగ్మెంట్‌కు రాహుల్ గాంధీ రాజీనామా

వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు తేదీ ఖరారైంది. నవంబరు 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ అలాగే రాయ్‌బరేలీ రెండు నియోజకవర్గాల నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించారు. దీంతో వయనాడ్ సెగ్మెంట్‌కు ఆయన రాజీనామా చేశారు. రాయ్‌బరేలీ ఎంపీ గా కొనసాగుతున్నారు.

కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గానికి నవంబరు 13 న ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ విషయం వెల్లడించింది. కొన్ని నెలల కిందట జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్ , రాయ్‌బరేలీ …రెండు సెగ్మెంట్ల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయం సాధించారు. అయితే వయనాడ్‌ సీటుకు రాజీనామా చేశారు. లోక్‌సభలో రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వయనాడ్ లో విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇదిలాఉంటే తాజాగా మహారాష్ట్ర, రాయ్‌బరేలీ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కాగా మహారాష్ట్ర లో ఒకే విడతలో నవంబరు 20న ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఝార్కండ్‌లో రెండు విడతల్లో నవంబరు 13, నవంబరు 20 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇదిలా ఉంటే నవంబరు 23న రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు.

Exit mobile version