Site icon Swatantra Tv

ఫోన్‌ ట్యాపింగ్‌లో కీలకంగా మారిన రాధాకిషన్‌రావు స్టేట్‌మెంట్‌

    ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అండ్‌ టీమ్‌ అక్రమాలు బయటపడుతున్నాయి. రాధాకిషన్‌రావు రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. నలుగురు కీలక పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా రాధాకిషన్‌ వ్యవహ రించారు. తన చిన్ననాటి మిత్రుడు అయిన ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహాయం అందించారని పోలీసులు తెలిపారు.

గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీస్ వాహనాల్లో డబ్బులను రవాణా చేశారు. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్‌ ఎస్సైని ఉపయోగించి డబ్బులను రవాణా చేసినట్టు నిర్ధారణ అయింది. డబ్బులకు ఎస్కార్ట్ ఇచ్చి మరీ డెలివరీ చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే మాజీ ఎస్పీకి సైతం డబ్బుల రవాణాలో పాత్ర ఉంది. ఆ ఎస్సై పలు సార్లు 3 కోట్ల డబ్బులు తర లించారు.డబ్బుల వ్యవహారం బయట పడకుండా ఉండేం దుకు కొత్త సిమ్ కార్డు, ఐఫోన్ ఎస్ఐకి సమకూర్చారు. డబ్బులు తరలించిన ఎస్ఐ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో రాజకీయ నాయకు లపై నిఘా కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులపై నిఘా పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభాకర్‌కి రాధాకిషన్‌ రావుకు చేరవేశారు. ప్రణీత్ రావు ఇచ్చే సమాచారంతో రాధా కిషన్ రావు నిఘాను పెట్టారు. రాధాకిషన్‌ సహకరించిన ఎస్సైలు, ఇన్స్పెక్టర్లతో పాటు మాజీ పోలీసు అధికారులను పోలీసులు విచారించనున్నారు. పలువురు రాజకీయ నేతల విచారణకు రంగం సిద్దం చేశారు.

Exit mobile version