పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ.. ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. హైదరబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు భరత్ అధ్యక్షతన.. బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బీసీ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి అమలు చేసి.. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కేంద్రంలో ప్రతిపక్షం ఇప్పుడు బలంగా ఉందని… కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. ఆగస్టు 6న పార్లమెంట్ ముందు చేపట్టే ఆందోళన కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించినట్లు తెలిపారు.
ఆగస్టు 6న ఛలో పార్లమెంట్‌కు ఆర్ కృష్ణయ్య పిలుపు
