Site icon Swatantra Tv

వైసీపీలోకి ప్రతిపక్ష నేతల క్యూ

    ఏపీలో పొత్తులు ప్రత్యర్థికి బలంగా మారిందా.? కూటమి వ్యూహమే కొంప ముంచుతోందా..? బుజ్జగింపులు పని చేయడం లేదా..? అధినేతలే దిగివచ్చి నచ్చజెప్పినా అలక వీడటం లేదా.? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇంతకీ ప్రత్యర్థికి బలంగా మారిన అంశాలేంటి.? కూటమి వ్యూహం ఎందుకు కొంపు ముంచుతోంది..? అసలు అలకలెందుకో తెలియాలంటే వాచ్‌ దిస్‌ స్టోరీ.

  వైనాట్‌ 175 అంటూ కదనరంగంలోకి దిగిన సీఎం జగన్‌కు చేరికల జోరు ఉత్సాహాన్నిస్తుంటే.. మరోవైపు అసంతృప్తుల తీరు టీడీపీ, జనసేన అధినేతలను తలనొప్పిగా మారింది. అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన కూటమి వ్యూహమే కొన్ని చోట్ల కొంప ముంచుతోంది. పొత్తు ధర్మంలో భాగంగా టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలంతా ఒక్కొక్కరుగా వైసీపీలోకి క్యూకడుతుంటే ప్రత్యర్థికి బలంగా మారుతున్నారు. దీంతో ప్రేక్షక పాత్ర వహించడం తప్ప చేసేదేమీలేక చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ తలలుపట్టుకుం టున్నారు.

    ఏపీ ఎన్డీఏ కూటమిలో నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. దీంతో టికెట్‌ ఆశించి భంగపడ్డ టీడీపీ, జనసేన నేతలంతా వైసీపీలోకి క్యూ కడుతున్నారు. జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుం టున్నారు. టికెట్‌ ఇచ్చే అవకాశం లేకపోయినా ఆ పార్టీలో చేరేందుకు సై అంటున్నారు. మరోపక్క అసంతృప్త నేతలకు వైసీపీ ఘనస్వాగతం పలుకుతోంది. దీంతో చేరికలతో ఆ పార్టీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే వైసీపీ 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం తో.. వైసీపీలో కొత్తగా వచ్చే వారికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అయినా సరే వైసీపీలో చేరేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు ఉత్సాహం చూపుతున్నారు. తమకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేసిన పార్టీ నేతలను ఓడించేందుకు, అధికార పార్టీతో చేతులు కలిపేందుకు వెనకాడటం లేదు. అందులో భాగంగా ఇప్పటికే చాలామంది నేతలు వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. మరి కొంతమంది కూడా అదే బాటలో పయనిస్తు న్నారు.

    ముఖ్యంగా జనసేన నుంచి వైసీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ఆ పార్టీ నేతలు వైసిపిలో చేరారు. శేషు కుమారి, పితాని బాల కృష్ణతోపాటు పలువురు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైసీపీలో చేరిపోగా విజయవాడ నుంచి జనసేన కీలక నేత పోతిన మహేష్ కూడా ఆ పార్టీని వీడి వైసీపీ కండువా కప్పుకున్నారు. అలాగే పి.గన్నవరం, రాజోలు నియోజక వర్గాలకు చెందిన జన సేన నేతలు సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన జనసేన నేత మను విక్రాంత్‌రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో దాదాపు ఆ జిల్లాలో జనసేన పార్టీ ఖాళీ అయింది. అలాగే కాకినాడ మాజీ మేయర్ సరోజ జనసేనకు రాజీనామా చేసి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు టిడిపి నేతలు సైతం వైసిపిలోకి క్యూ కడుతున్నారు.

Exit mobile version