Site icon Swatantra Tv

పుష్ప 2 నిర్మాతలకు హైకోర్టులో ఊరట.. వారిని అరెస్ట్‌ చేయొద్దు

పుష్ప 2 నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సంధ్య థియేటర్‌ తొక్కసలాట ఘటనలో నిర్మాతలపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు. నిర్మాతలు రవిశంకర్‌, నవీన్‌ను అరెస్టు చేయొద్దని.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

విచారణ సందర్భంగా తొక్కిసలాట ఘటనకు నిర్మాతలకు సంబంధం లేదని వారి తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మందుస్తు సమాచారంలో భాగంగా నిర్మాతలు పోలీసులకు సమాచారమిచ్చామని చెప్పారు. సమాచారం ఇచ్చరు కాబట్టే పోలీసులు థియేటర్‌కు వచ్చారు. కానీ అనుకోని ఘటన జరగడం కారణంగా నిర్మాతలను నిందితులిగా చేర్చారని .. ఇందులో వారి ప్రమేయం లేదని వాదనలు లాయర్‌ వినిపించారు.

పుష్ప 2 రిలీజ్‌ డే రోజున సంథ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవంత్‌ అనే మహిళ మృతి చెందగా.. ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ఈ కేసులో హీరో అల్లు అర్జున్‌ అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యాడు.

 

Exit mobile version