Site icon Swatantra Tv

తెలంగాణ సీఎంతో పంజాబ్‌ సీఎం భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ అయ్యారు. పలు కార్యక్రమాల కోసం ఇవాళ హైదరాబాద్ వచ్చిన భగవంత్ మాన్ ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్.. పంజాబ్ ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వేరువేరు రాష్ట్రాల్లో ఆమ్‌ఆద్మీపార్టీ.. బీజీపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేపథ్యంలో… ఇరుపార్టీలూ జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

Exit mobile version