Site icon Swatantra Tv

రాహూల్‌గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆందోళన

రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తనున్నాయి. ఆందోళనలో భాగంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయనున్నారు కమలనాథులు.

అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్.. వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ యూనివర్సిటీలో జరిగిన ఓ ముఖాముఖి సమావేశంలో రిజర్వేషన్లపై మాట్లాడారు. భారతదేశం న్యాయమైన దేశంగా మారినపుడే రిజర్వేషన్ల తొలగింపు గురించి ఆలోచించాలి, ప్రస్తుతం భారతదేశంలో న్యాయం లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడీ వ్యాఖ్యలే తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడల్లా భారత్ ను అవమానించేలా మాట్లాడుతున్నాడాని మండిపడుతోంది కమలదళం. ఈ నేపథ్యంలోనే నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది బీజేపీ.

Exit mobile version