Site icon Swatantra Tv

ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధం- సీఎం రేవంత్

ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌పై సభలో చర్చించాలని కేటీఆర్‌ ఇంతకాలం ఎందుకు అడగలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం… ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంపై ఏసీబీ విచారణ జరుగుతోందన్నారు. ఈ కార్‌ రేస్‌ ప్రతినిధులు వచ్చి తనను కలిశారని తెలిపారు. 600 కోట్లు పెండింగ్‌ నిధులు రావాల్సి ఉంది.. ఇవ్వమని అడిగారని చెప్పారు. మీరు ఊ.. అంటే మరోసారి రేసింగ్‌ నిర్వహిస్తామని చెప్పారని తెలిపారు. ఎఫ్‌ఈవో ప్రతినిధులు వచ్చి కలిసిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. HMDA ఖాతాలోని కోట్ల నిధులు లండన్‌లోని కంపెనీకి నేరుగా ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. నిర్వాహకులతో కేటీఆర్‌ కుదుర్చుకున్న ఒప్పందం 600 కోట్ల విలువైనదని తెలిపారు. తాను జాగ్రత్త పడటం వల్ల రూ.450 కోట్లు మిగిలాయని అన్నారు. రూ.55 కోట్లు చిన్న విషయం కాదని సీఎం రేవంత్‌ అన్నారు.

Exit mobile version