Site icon Swatantra Tv

హిమాచల్ కొత్త సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు.! -రేసు నుంచి తప్పుకున్న ప్రతిభాసింగ్

హిమాచల్ ప్రదేశ్ కొత్త సీఎంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సుఖ్విందర్ సింగ్ సుఖు బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్తగా ఎన్నికైన 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కూడిన లెజిస్లేచర్ పార్టీ.. సుఖ్విందర్ సింగ్ ను ఎన్నుకున్నది. సీఎం పదవి రేస్ నుంచి పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభాసింగ్ తప్పుకున్నారు. ఆదివారంనాడే సుఖ్విందర్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉంది. సుఖు ఇప్పటివరకూ హిమాచల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్ గా ఉన్నారు.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ కుటుంబసభ్యులను సంప్రదించి పార్టీ పరీశీలకులు సుఖ్విందర్ సింగ్ పేరు ఖరారు చేశారు. పార్టీలో అన్నివర్గాలనూ సంతృప్తి పరిచేందుకు ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రులను ఎంపికచేసే అవకాశం ఉంది. మాజీ ప్రతిపక్ష నాయకుడు ముఖేశ్ అగ్నిహోత్రి, ప్రతిభాసింగ్ కుమారుడు విక్రమాదిత్యసింగ్ డిప్యూటీ సీఎంలు నియమితులవుతారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్ అధిష్టానం పరిశీలకులుగా ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్, హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుదా, హిమాచల్ ప్రదేశ్ ఏఐసీసీ ఇన్ చార్జి రాజీవ్ శుక్లా వ్యవహరించారు.

Exit mobile version