Site icon Swatantra Tv

మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నా వాయిదా

మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన మహాదర్నా వాయిదా పడింది. రాష్ట్రంలో గిరిజనులు, దళితలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఇవాళ మహబూబాబాద్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించాలని ప్లాన్ చేసింది. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకుని ధర్నా నిర్వహిస్తామని బీఆర్ఎస్ పేర్కొంది.

మరోవైపు మహబూబాబాద్‌లోని ఎస్పీ కార్యాయం ఎదుట రాత్రి ఉద్రిక్తత ఏర్పడింది. మహాధర్నాకు అనుమతి కోరుతూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టి.. నినాదాలు చేసింది. ఆందోళనకారులు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలోకి వాటర్ బాటిల్స్ విసిరారు. ఏఎస్సీతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో మహాధర్నాను బీఆర్ఎస్ వాయిదా వేసింది. హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకుని దర్నా నిర్వహిస్తామని పేర్కొంది. హైకోర్టు అనుమతి వచ్చాక 50 వేల మందితో దర్నా నిర్వహిస్తామని ప్రకటింది. గిరిజనులకు కేటీఆర్ అండగా నిలుస్తుంటే.. ప్రభుత్వం ఓర్వలేకపోతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

Exit mobile version