Site icon Swatantra Tv

హిందూ ఆలయాల దాడులపై ప్రధాని మోడీ ఆందోళన

Hindu temples in Australia

Hindu temples in Australia |ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుండడంపై భారత ప్రధాని మోడీ స్పందించారు. ఈ ఘటనలు తమను ఎంత బాధపెడుతున్నాయో వివరించారు. హైదరాబాద్‌ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రెండోరోజున భారత్‌ పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్‌ ముందు- రెండుదేశాల సంబంధాలపై చర్చ జరిగిందని మోడీ తెలిపారు. ఆస్ట్రేలియాలోని హిందూ ఆలయాలపై దాడులు తమ కలవరుస్తున్నాయని, ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ అంశంపై ఆల్బనీస్‌ స్పందిస్తూ ఆస్ట్రేలియాలోని భారతీయ భద్రత తమకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నట్లు మోదీ వివరించారు.

Hindu temples in Australia |ఈ సమావేశంలో సమగ్ర ఆర్థిక ఒప్పందాన్ని పూర్తిచేసుకోవడానికి రెండు దేశాలు అంగీకరించాయని ఆసీస్‌ ప్రధాని ఆల్బనీస్‌ చెప్పాడని మోడీ స్పష్టం చేశారు . అలాగే రెండుదేశాల మధ్య ఆడియో విజువల్‌ సహకార ఒప్పందంపై చర్చ జరిగిందని.. స్కిల్డ్‌ జాబ్స్‌, సాంస్కృతిక, సృజనాత్మక సహకారం పరస్పరం అందించడమే ఈ ఒప్పంద ఉద్దేశ్యామని అన్నారు.

Read Also: V6 ఛానల్ ను రద్దు చేస్తారట… దమ్ముంటే రద్దు చేయ్ బిడ్డా… నీ సంగతి చూస్తా..!!

Follow us on:   Youtube   Instagram

Exit mobile version