- హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ సెంటర్ కార్యకలాపాలను రెట్టింపునకు నిర్ణయం
- దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో..
- మంత్రి కేటీఆర్ ప్రముఖ వ్యాపార వేత్తలతో భేటీ
- హైదరాబాద్‌లో మల్టీ గిగావాట్ ఎల్సీ తయారీ కేంద్రం
- ప్రకటించిన అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్
- ఈ కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీల ఉత్పత్తి
తెలంగాణకు పెప్సికో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ కార్యకలాపాలను రెట్టింపు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో.. మంత్రి కేటీఆర్‌తో భేటీ అనంతరం ఈ ప్రకటన చేశారు పెప్సీకో ప్రతినిధులు. హైదరాబాద్‌లోని తమ ఉద్యోగులను 2,800 నుంచి 4 వేలకు పెంచుతున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్ గ్లోబల్ బిజినెస్ సెంటర్ కార్యకలాపాలను రెట్టింపు చేసేందుకు పెప్సీకో తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి మరో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. దీని ద్వారా 600 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రతిపాదిత కేంద్రంలో లిథియం ఐరన్ ఫాస్పేట్ యాక్టివ్ బ్యాటరీల ఉత్పత్తి చేయనుంది.