Site icon Swatantra Tv

గూగుల్ కు దిమ్మతిరిగే షాక్.. రూ.1,337కోట్ల జరిమానా చెల్లించాల్సిందే

ప్రముఖ సెర్చింజన్ దిగ్గజ సంస్థ గూగుల్ కు భారీ షాక్ తగిలింది. 30రోజుల్లోగా రూ.1,337.76కోట్ల జరిమానాను చెల్లించాలని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌(NCLAT) ఆదేశించింది. ఆండ్రాయిడ్‌లో తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) విధించిన జరిమానాను NCLAT సమర్ధించింది. కాగా గతేడాది అక్టోబర్‌ 20న గూగుల్ కు CCI జరిమానా విధించగా.. NCLATను గూగుల్ ఆశ్రయించింది. తాజాగా గూగుల్ విజ్ఞప్తిపై విచారణ చేపట్టిన NCLAT ధర్మాసనం పైవిధంగా తీర్పునిచ్చింది. అంతేకాకుండా అనైతిక వ్యాపార విధానాలను మార్చుకోవాలని సూచించింది.

Exit mobile version