Site icon Swatantra Tv

రాజకీయాల్లోనూ ట్రెండ్ క్రియేట్ చేస్తోన్న పవన్

సినిమాల్లో మాత్రమే కాదు.. రాజకీయాల్లోనూ తన మార్క్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇప్పటికే పిఠాపురంలో అధికారుల పనితీరుపై సర్వే చేయించాలని నిర్ణయించి సంచలనం క్రియేట్ చేశారు. తాజాగా వారెవ్వా అనిపించేలా ఆయన మరో నిర్ణయం తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారు.. విగ్రహాలు, బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని రిక్వెస్ట్ చేశారు. వాటికి బదులుగా ప్రజలకు ఉపయోగపడేవి తేవాలని సూచించారు.

బొకేలు, శాలువాలకు బదులు కూరగాయలు వంటివి తీసుకువస్తే అనాథ శరణాలయాలకు ఇవ్వొచ్చన్నారు పవన్. విగ్రహాలు, శాలువాలు ఖర్చు చేసే డబ్బును టోకెన్ కింద ఇస్తే.. అన్నా క్యాంటీన్లకు వినియోగించవచ్చని చెప్పారు. పవన్ కళ్యాణ్‌ను కలవడానికి వచ్చిన సమయంలో.. బొకేకు బదులుగా కూరగాయల బుట్టను బహూకరించారు జనసేన ఎంపీలు. ఈ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చిన ఎంపీలు బాలశౌరి, ఉదయ్‌లను పవన్ కల్యాణ్ అభినందించారు.

Exit mobile version