Site icon Swatantra Tv

పవన్ కు వైరల్ ఫీవర్.. రేపటి జనసేన విస్తృత స్థాయి సమావేశం రద్దు

స్వతంత్ర వెబ్ డెస్క్:  జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన జనసేన విస్తృత స్థాయి సమావేశం రద్దయింది. వచ్చే ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో… టీడీపీతో కలిసి క్షేత్ర స్థాయిలో వెళ్లే అంశంపై పార్టీ నేతలకు రేపటి సమావేశంలో పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయాల్సి ఉంది. వైరల్ ఫీవర్ నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా పడింది. సమావేశం తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామని జనసేన ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

Exit mobile version