Site icon Swatantra Tv

పార్టీలలో పైసల లొల్లి

   పైసల పంచాయితీ, నేతల అలకలు ఆదిలాబాద్‌ జిల్లా పాలిటిక్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి. నగుదు పంపకాల వ్యవహారంతో నేతల మధ్య చిచ్చు రాజుకోవడం, ఆ మాత్రం ఖర్చుకైనా ఇవ్వరా అంటూ కార్యర్తలు సైతం కన్నెర్ర చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.

   ఆదిలాబాద్‌ జిల్లా ఎన్నికల పర్వంలో డబ్బు రాజకీయం నేతల మధ్య చిచ్చుపెడుతోంది. గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మ కంగా ముందుకు సాగుతున్న ప్రధాన పార్టీలు. ఎన్నికల ఖర్చు కోసం ఆయా పార్టీల అధిష్టానాలు డబ్బులు పంపడంతో ఈ చిచ్చు రాజుకున్నట్టు తెలుస్తోంది. నగదు పంపకాలు, లెక్కల వ్యవహారంలో తేడాతో లీడర్ల మధ్య ఈ పైసల లొల్లి ముదురుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక మా ఖర్చులకైనా ఇవ్వకపోతే ఎలా అంటూ కార్యకర్తలే నిలదీ స్తున్న పరిస్థితితో నాయకులు తీరుపై విమర్శలు గుప్పుముంటున్నాయి.

ప్రధాన పార్టీల నుంచి సుమారు 14 నుంచి 15 కోట్లు అధిష్టానం పంపినట్టు టాక్‌ నడుస్తోంది. ఈ లెక్కన ఒక్కో నియోజక వర్గానికి రెండు కోట్ల చొప్పున నగదు పంపకాలు జరగాలి. కానీ కేవలం నియోజకవర్గానికి 10 నుంచి 15 లక్షల చొప్పున మాత్రమే పంపిణీ చేసి మిగిలిన డబ్బంతా నొక్కేసే ప్రయత్నంలో ఉన్నారట జిల్లా అగ్రనేతలు. దీంతో డబ్బులు సరిపో వడం లేదంటూ నియోజకవర్గంలోని నాయకుల మధ్య సైలెంట్‌ వార్‌ నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నామినేషన్‌ వేసిన నాటి ఇప్పటి వరకూ తమ ఖర్చులకైనా డబ్బులు ఇవ్వలేదని కార్యకర్తలు సైతం నేతల తీరుపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని కొందరు నిలదీయడంతో నియోజకవర్గం ఖర్చుల పేరిట ఎంతో కొంత చేతిలో పెట్టి వారి కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారట నేతలు. ఇక హైకమాండ్‌ ఇచ్చిన డబ్బులు నొక్కేసే ప్లాన్‌లో భాగంగా డబ్బు లకు ఆశ పడకుండా పార్టీ కోసం అంకిత భావంతో పని చేసే వారికి ముందు ప్రయారిటీ ఇస్తూ.. ఇతర పార్టీల ముందు చులకన కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిల్లా నేతలు. ఆయా పార్టీలకు అనుకూలంగా ఉండి.తమకు అంతగా నమ్మకం లేని కార్యకర్తలకు మాత్రం ఖర్చుల పేరుతో కొంత చేతిలో పెట్టి సర్ది చెబుతూ తమ ఆధీనంలో ఉండేలా అగ్ర నేతలు వ్యవహరిస్తన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే,.. ప్రస్తుత రాజకీయాలు మనీ మైండ్‌తో నడుస్తున్నా యి కాబట్టి… నేతలు డబ్బులు నొక్కేసే ప్రయత్నం చేసినా.. అభ్యర్థులు పిసినారి తనం చూపించినా ఆ ప్రభావం గెలుపోటములపై ఎఫెక్ట్‌ చూపుతుందంటున్నారు రాజకీయ నిపుణులు.

Exit mobile version