Site icon Swatantra Tv

మణిపూర్ కు ప్రతిపక్ష కూటమి ఎంపీలు.. ఉత్కంఠ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: హింసాత్మకత ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను విపక్ష ( ‘ఇండియన్‌ నేషనల్‌ డెవల్‌పమెంటల్‌ ఇంక్లూసివ్‌ అలయన్స్‌’)కు చెందిన ఎంపీల బృందం సందర్శించనుంది. 20 మందికిపైగా ఎంపీలు ఉండే ఈ బృందం ఈ రోజు, రేపు మణిపూర్‌ లో పర్యటిస్తోంది.. రెండ్రోజుల పాటు అక్కడ నెలకొన్న పరిస్థితులను ఈ బృందం పరిశీలించనుంది.  వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులతో భేటీ కానున్నది. అలాగే పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులను బృందం తెలుసుకుంటుంది. దీంతో ఉత్కంఠ కొనసాగుతోంది.

 మరోవైపు మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడంలేదు. గురువారం బిష్ణుపూర్‌ జిల్లాలోని మొయిరాంగ్‌లో రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తుపాకులతో పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. అనేక ఇళ్లను దహనం చేశారు. కాగా ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన కేసును సీబీఐ విచారించనుంది.
Exit mobile version