Site icon Swatantra Tv

‘జితేందర్ రెడ్డి’ ఎవరో తెలిసేది ఆరోజే!

అసలు ఎవరు ఈ ‘జితేందర్‌ రెడ్డి’ ఏముంది ఆయన గురించి తెలుసుకోవడానికి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి ప్రేమ కథలను అందించిన విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘జితేందర్‌ రెడ్డి’. రీసెంట్‌గా వచ్చిన పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచగా తాజాగా విడుదలైన ‘జితేందర్‌ రెడ్డి’ ఇచ్చిన హామీ వీడియో అసలు ఎవరు ఈ ‘జితేందర్‌ రెడ్డి’ అని తీసుకోవాలనే అంచనాలను పెంచేసింది. ‘జితేందర్‌ రెడ్డి’ అనే నేను అంటూ ఆయన చేసిన హామీ, ఆ వీడియోలో చూపించిన ‘ధీరుడు ఒకసారే మరణిస్తాడు కానీ పిరికివాడు క్షణక్షణం మరణిస్తాడు’ అన్న మాట ఆలోచింపచేసే విధంగా ఉంది. ఈ సినిమాలో ‘జితేందర్‌ రెడ్డి’గా చేసింది ఎవరు అని తెలుసుకోవాలంటే ఈ నెల 21న ఫస్ట్ లుక్ విడుదల చేసే వరకు ఆగాల్సిందేనని చిత్ర యూనిట్ చెబుతోంది. వి.ఎస్‌ జ్ఞాన శేఖర్‌ కెమెరామెన్‌ పని చేస్తున్న ఈ చిత్రానికి మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్‌ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ముదుగంటి క్రియేషన్స్‌ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version