Site icon Swatantra Tv

IND vs AUS: విశాఖలో నేడు వన్డే.. మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ

విశాఖపట్నంలో నేడు భారత్, ఆసీస్ మధ్య కీలకమైన రెండో వన్డే జరగనుంది. ఈ వన్డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుండగా.. సిరీస్ సమం చేయాలని ఆస్ట్రేలియా ఆరాటపడుతున్నాయి. ఇషాన్ కిషన్ స్థానంలో రోహిత్ జట్టులోకి రానుండగా, ఆసీస్ ఫస్ట్ వన్డే ఆడిన టీమ్ తోనే బరిలో దిగే అవకాశం ఉంది. నేడు వైజాగ్ లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఓవర్లు కుదించయినా మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు.

ఇండియా టీమ్ : శుభమన్ గిల్, రోహిత్ శర్మ (c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, KL రాహుల్ (wk), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్/జయ్‌దేవ్ ఉనద్కత్

ఆస్ట్రేలియా టీం : డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్ (c), అలెక్స్ కారీ (WK), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా

Exit mobile version