Site icon Swatantra Tv

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకూ నోటిఫికేషన్‌ విడుదల

     ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకూ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నేటి నుంచి ఈనెల 25 వరకూ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ కు ఈనెల 29 వరకూ గడువు ఇచ్చారు. ఈనెల 26న నామినేషన్ల పరిశీలన.. అనంతరం స్క్రుటినీ చేస్తారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ నిర్వహిస్తారు.

   నామినేషన్ల జాతర ఇవాళ్టి నుంచే మొదలుకానుంది. తొలి రోజే ఏపీలో ప్రధాన అభ్యర్థులు నామిషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరపున నారా భువనేశ్వరి నామినేషన్‌ దాఖలు చేస్తారు. సీఎం జగన్‌ తరపున అవినాశ్‌ రెడ్డి ఒక సెట్‌ నామినేషన్‌ వేస్తారు, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షు రాలు పురంధేశ్వరి నామినేషన్‌ వేస్తారు. ఈనెల 22న పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈనెల 25న పులివెందులలో సీఎం జగన్‌ రెండో సెట్‌ నామినేషన్‌ వేస్తారు.

Exit mobile version