Site icon Swatantra Tv

నేటి నుండి బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు

   బీజేపీ అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్ బీజేపీ అభ్య ర్థుల నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు హాజరు కానున్నారు.

   మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ కు గోవా సీఎం ప్రమోద్ సావంత్ హజరు కానున్నారు. మల్కాజ్ గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ నామినేషన్‌కు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ హాజరవుతు న్నారు. మహబూబ్ నగర్ అభ్యర్థి డికే అరుణ నామినేషన్ కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరు కానున్నారు. రేపు సికింద్రాబాద్, ఖమ్మం అభ్యర్థులు నామినేషన్ లు వేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, వినోద్ రావుల నామినేషన్ కు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరు కానున్నారు. ఇక, ఈ నెల 22 న జహీరాబాద్, చేవెళ్ల, నల్గొండ, మహబూబాబాద్ కాండిడేట్‌లు నామినే న్‌లు వేయనున్నారు. జహీరాబాద్ బిబి పాటిల్ నామినేషన్‌కు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర పడ్నవీస్‌, చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ సైది రెడ్డి నామినేషన్‌కు పియుష్ గోయల్ హాజరుకాన్నారు. ఇక, మహబూబాబాద్ అభ్యర్థి సీతారాం నాయక్ నామినేషన్‌కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరుకాబో తున్నారు.

   ఈ నెల 23న భువనగిరి, 24న పెద్దపల్లి, అదిలాబాద్, హైదారాబాద్, వరంగల్‌ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. పెద్దపల్లి అభ్యర్థి నామినేషన్‌కు అశ్విని వైష్ణవ్, అదిలాబాద్ అభ్యర్థి నగేష్ నామినేషన్‌కు ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణు దేవ్ సాయి, హైదారాబాద్ అభ్యర్థి మాధవి లత నామినేషన్‌కు అనురాగ్ సింగ్ ఠాకూర్, వరంగల్ అభ్యర్థి అరూర్ రమేష్ నామినేషన్‌కు అశ్వినీ వైష్ణవ్ హాజరవుతారు.ఈ నెల 25న కరీం నగర్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ అభ్యర్థుల నామినేషన్ వేయబోతున్నారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, నాగర్ కర్నూల్ నుంచి భరత్‌ల నామినేషన్‌కు గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డిలు, నిజమాబాద్ అభ్యర్థి అరవింద్ నామినేషన్ కు అశ్విని వైష్ణవ్ లు హాజరు కానున్నారు.

Exit mobile version