Site icon Swatantra Tv

Nokia New Budget Phone| ఈ మొబైల్ ను మనమే రిపేర్ చేసుకోవచ్చు

నోకియా(Noika)స్మార్ట్ ఫోన్లకు ఉండే గిరాకీ దృష్ట్యా వినియోగదారులకు సరికొత్త టెక్నాలజీతో ఫోన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది ఆ సంస్థ. ఇందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా వినియోగదారుడే మొబైల్ రిపేరు చేసుకునే విధంలో బడ్జెట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొబైల్​ బ్యాక్ కవర్​, డిస్​ప్లే, ఛార్జింగ్​ పోర్ట్​, బ్యాటరీ ఏది చెడిపోయినా సరే వినియోగదారుడే వీటిని రిపేర్​ చేసుకోవచ్చు. జీ22మోడల్ తో పాటుగా సీ32, సీ22 అనే మరో రెండు స్మార్ట్​ఫోన్​లను మార్కెట్​లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. జీ22 మోడల్ లో 100శాతం రీసైకిల్ ప్లాస్టిక్ కిట్ ఉంటుందని సంస్థ తెలిపింది. అంతేకాకుండా దీని బ్యాటరీ లైఫ్ మూడు రోజులు ఉంటుందని పేర్కొంది. వినియోకగదారుడే సొంతంగా రిపేర్ చేసుకునేందుకు వీలుగా ఐఫిక్సిట్ భాగస్వామ్యంతో ఒప్పందం కుదుర్చుకుంది. Ifixit.com యాప్ ద్వారా రూ.430 చెల్లించి ఈ కిట్ ను పొందవచ్చని చెప్పింది. ఈ ఐఫిక్సిట్(Ifixit) రిపేర్ గైడ్ ఐదేళ్ల పాటు అందుబాటులో ఉంటుందని నోకియా సంస్థ వివరించింది.

Exit mobile version