Site icon Swatantra Tv

బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు

      బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప జిల్లాలో టెర్రరిస్ట్ లింకులపై NIA అధికారులు ఆరా తీశారు. మైదుకూరులో ఓ ప్రార్థనా మందిరం వద్ద అనుమానాస్పదంగా సంచరి స్తున్న PFIకి చెందిన అబ్దుల్ సలీంను అదుపులోకి తీసుకున్నారు. 25 రోజుల క్రితం కడప జిల్లా మైదు కూరుకు అబ్దుల్ సలీం వచ్చినట్లు తెలుస్తోంది. మైదుకూరు మండలం చెర్లోపల్లి దగ్గర సలీం ఓ నివాసం లో తలదాచుకున్నట్లు సమాచారం. జగిత్యాలకు చెందిన సలీంను ప్రస్తుతం హైదరాబాద్‌కు తరలించి నట్లు తెలుస్తోంది.

Exit mobile version