Site icon Swatantra Tv

కేటీఆర్‌కు కొత్త చిక్కులు

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ… రాజకీయ పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ప్రచారానికి దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించడంలో మంత్రి కేటీఆర్‌ ఒక అడుగు ముందున్నారనే చెప్పాలి. తాజాగా టీ హబ్‌లో విద్యార్థులు, యువతతో మంత్రి కేటీఆర్‌ జరిపిన సంభాషణ వివాదస్పదంగా మారింది.

మంత్రి కేటీఆర్‌ టీ హబ్‌ వేదికగా… ఎన్నికల ప్రచారం నిర్వహించడాన్ని తప్పుబడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మూడు రోజుల పాటు కేటీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తోసుకోవాలని కోరింది.

టీ హబ్‌ ప్రభుత్వ భవనమని, ప్రభుత్వ భవనాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం సరైంది కాదని కాంగ్రెస్‌ నేతలు తప్పబట్టారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం MCC వయోలెన్స్ కిందకు వస్తుందన్నారు. కాగా.. కాంగ్రెస్‌ ఫిర్యాదుతో కేటీఆర్ పై చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Exit mobile version