Site icon Swatantra Tv

పార్లమెంట్‌లో నీట్‌ ప్రకంపనలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే లోక్‌సభలో నీట్‌ ప్రకంపనలతో రచ్చ రాజుకుంది. మొదటి రోజే మోదీ సర్కార్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసిన ఇండియా కూటమి… నీట్ అంశంపై నిరసనకు దిగింది. ఈ సందర్భంగా మోదీ సర్కార్‌పై తీవ్రస్థాయలో విమర్శలు గుప్పించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇది చాలా పెద్ద సమస్య అని మండిపడ్డారు. విద్యార్థు జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్కసారిగా ప్రతిపక్షాలంతా నినాదాలు చేస్తూ చర్చకు పట్టుబట్టడం వల్ల గందరగోళం నెలకొంది. నీట్ పరీక్షను యూపీఏ ప్రభుత్వమే తీసుకొచ్చిందంటూ విపక్షాలకు కౌంటర్‌ ఇచ్చారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. పేపర్ లీక్‌పై సీఐబీ విచారణ జరుగుతోందని తెలిపారు.

Exit mobile version