Site icon Swatantra Tv

ధనుష్‌పై నయనతార తీవ్ర విమర్శలు

నటుడు ధనుష్‌పై నటి నయనతార తీవ్ర విమర్శలు చేశారు. తన డాక్యుమెంటరీలో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె ఈ విమర్శలు చేశారు. ఈమేరకు ఆయనకు ఓ బహిరంగ లేఖ రాశారు. తమపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకోవడం సరికాదని హితవు పలికింది.

నయనతార గతంలో నేనూ రౌడీనే సినిమా చేసింది. దీనికి దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌, హరో ధనుష్‌ నిర్మాత. ఈ మూవీ చేస్తున్న మయంలోనే విఘ్నేష్‌, నయనతార ప్రేమలో పడ్డారు. చాన్నాళ్లపాటు రహస్యంగా రిలేషన్‌లో ఉన్నారు. 2022లో పెళ్లి చేసుకున్నారు. ఈమె పెళ్లి, జీవిత విశేషాలతో ‘బియాండ్ ది ఫెయిరీటేల్‌లో’ పేరుతో నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. నవంబర్‌ 18న దీన్ని రిలీజ్‌ చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

డాక్యుమెంటరీ ట్రైలర్‌లో నేనూ రౌడీనే షూటింగ్‌ టైంలో తీసిన 3సెకన్ల వీడియో క్లిప్‌ ఉపయోగించారు. తన అనుమతి లేకుండా మూడీ బిట్స్‌ ఉపయోగించడంపై నిర్మాత ధనుష్‌ సీరియస్ అయ్యారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఆలస్యం కావడానికి హీరో ధనుష్ కారణమని చెబుతూ అతడిపై బహిరంగ లేఖ రాసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. అభిమానులకు కనిపించే ధనుష్ వేరు అని.. నిజానికి అసలైన ధనుష్ వేరని.. ఫ్యాన్స్‌కు సూక్తులు చెప్పే తాను పాటించరంటూ రేంజ్‌లో విరుచుకుపడింది.

Exit mobile version