30.7 C
Hyderabad
Friday, April 19, 2024
spot_img

2 గుండెలు, 4 కాళ్లు, 4 చేతులతో వింత శిశువు జననం

Strange Baby |బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానం ప్రకారం నిజంగానే అన్నీ జరుగుతున్నాయా అంటే నిజమనే చెప్పాల్సి వస్తుంది. తాజాగా 2 గుండెలు, 4 కాళ్లు, 4 చేతులతో ఆడ శిశువు జన్మించడమే ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని చురు జిల్లా స్థానిక ఆసుపత్రిలో ఓ వింత శిశువు జన్మించింది. రెండు గుండెలు, నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో పుట్టిన ఈ ఆడశిశులు.. 20 నిమిషాల వరకు ప్రాణాలతో ఉంది. ఆతర్వాత చెందింది. చురు జిల్లా రతన్‌గఢ్‌కు చెందిన హజారీ సింగ్ (19) అనే గర్భిణి పురిటి నొప్పులతో గంగారామ్ ఆసుపత్రిలో చేరింది. నిండు గర్భిణిని సోనోగ్రఫీ చేసిన వైద్యులు.. గర్భంలో వింత శిశువును ఉండటం గమనించారు. ఆ తర్వాత ఎలాంటి ఆపరేషన్ లేకుండా నార్మల్ డెలివరీ చేశారు.

అనంతరం వైద్యులు మాట్లాడుతూ.. శిశువుకు ఒక తల రెండు గుండెలు, నాలుగు చేతులు, నాలుగు కాళ్లతోపాటు రెండు వెన్నెముకలు ఉన్నాయని.. ఐతే హృదయ స్పందనలు తక్కువగా ఉండడంతో పుట్టిన 20 నిమిషాలకే శిశువు మృతి చెందిందని అన్నారు. ప్రస్తుతం తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు.

Read Also: ఏసీ పేలి.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

మైదుకూరు వైసీపీ అభ్యర్థిగా రఘురామిరెడ్డి నామినేషన్ కడప జిల్లా మైదుకూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవులతో కలిసి స్థానిక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్