30.2 C
Hyderabad
Thursday, June 8, 2023

నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్‌ 8వ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి  ప్రతిపక్షాల నుంచి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మాత్రమే హాజరవుతుండడం విశేషం. మరోవైపు మోదీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్‌ సీఎంలతో పాటు యూపీఏ భాగస్వామ్య పార్టీల సీఎంలు కూడా నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరవుతారని నిన్నటి వరకు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పినా చివరి నిమిషంలో ఆయన కూడా దూరంగా ఉండాలని భావించారు. తొలుత నీతి ఆయోగ్‌ భేటీకి హాజరై.. తర్వాత ప్రతిపక్షాల నేతలను కలుసుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుకున్నారు. అయితే ఆమె కూడా ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించారు. కాగా 2045 కల్లా దేశాన్ని అభివృద్ధి చేసేందుకు రోడ్‌ మ్యాప్‌ రూపకల్పనకు ఈ సమావేశం ఉపయోగపడనుందని నీతి ఆయోగ్‌ ఓ ప్రకటన జారీచేసింది.

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్