30.2 C
Hyderabad
Thursday, June 8, 2023

Election Results| బీజేపీ తగ్గలేదు.. కాంగ్రెస్ నెగ్గలేదు

Election Results: లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన సెమీ ఎన్నికల్లో కమలం పార్టీ మొదటి విజయం అందుకుంది. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్ లో జరిగిన ఎన్నికల్లో కాషాయం జెండా రెపరెపలాడింది. అయితే మేఘాలయ రాష్ట్రంలో మాత్రం చతికిలపడింది. ఇక కాంగ్రెస్ మాత్రం మూడు రాష్ట్రాల్లో ప్రభావం చూపలేకపోయింది.

నాగాలాండ్ లో 60 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగ్గా.. NTPP-BJP కూటమి ఏకంగా 38స్థానాల్లో విజయం సాధించి అధికారం సొంతం చేసుకుంది. ఇక NPP 4, NPF2, ఇతరులు 16స్థానాలు గెలుచుకున్నారు.

త్రిపుర రాష్ట్రంలోనూ బీజేపీ కూటమి విజయం సాధించింది. 60సీట్లకు గాను IPTFతో కలిసి 33 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్-వామపక్షాల కూటమి 14 స్థానాల్లో విజయం సాధించగా.. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన తిప్రా మోథా పార్టీ అనూహ్యంగా 13స్థానాలు తన ఖాతాలో వేసుకుంది.

మేఘాలయలో మాత్రం బీజేపీ కూటమికి భంగపాటు తప్పలేదు. కేవలం 2సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది. ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. NTPP 27స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలవగా.. UDP 11, TMC 5, PDF 2 స్థానాలు గెలుచుకున్నాయి. మిగిలిన స్థానాల్లో ఇతరులు గెలుపొందారు.

Latest Articles

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. గవర్నర్ కు టీడీపీ విన్నపం

స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని టీడీపీ నేతలు అన్నారు. గురువారం నాడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, మండలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
252FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్