25.7 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

Cyber Crime |వ్యక్తిగత డేటా చోరీ.. ముఠా అరెస్ట్‌..

Cyber Crime |వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా కోట్ల మంది సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని ఈ ముఠా చోరీ చేసినట్లు తెలుస్తోంది. ఆధార్, పాన్, బ్యాంకు అకౌంటు లకు సంభందించిన డేటాను చోరీ చేస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. పలు ఆన్ లైన్ వెబ్ సైట్ల నుండి డేటా ను చోరీ చేస్తోంది ఈ ముఠా. పాన్ ఇండియా గవర్నమెంట్ ఉద్యోగుల డేటా తో పాటు పలు బ్యాంక్ ల క్రెడిట్ కార్డ్ ల డేటా, పాన్ కార్డ్, పాలసీ బజార్ వంటి పేరున్న సంస్థల నుంచి డేటాను చోరీ చేసి.. ఆ సమాచారాన్ని కొన్ని ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దేశ వ్యాప్తంగా డేటా చౌర్యానికి పాల్పుడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేస్తుండగా.. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు నిందితుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నాగపూర్, ఢిల్లీ, ముంబై కి చెందిన ముఠా గా సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.

Cyber Crime |సైబరాబాద్ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. దేశంలోని 16 కోట్ల 80 లక్షల మంది డేటాను చోరీ చేసిన తొమ్మిది మంది సభ్యుల ముఠాను గుర్తించామన్నారు. వ్యక్తిగత డేటాను సేకరించి ఈ ముఠా విక్రయిస్తుందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల డేటాతో పాటు ఇతరుల డేటాను కూడా అమ్మకానికి పెట్టారని చెప్పారు. ఫేస్ బుక్ యూజర్ల ఐడీ, పాస్ వర్డ్ లను కూడా ఈ ముఠా చోరీ చేసిందని వివరించారు. రుణాలు, భీమా కోసం ధరఖాస్తు చేసుకున్న వారి డేటాను కూడా ఈ ముఠా చోరీ చేసిందని స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఐటీ ఉద్యోగుల డేటా కూడా చోరీకి గురైందన్నారు. కీలక డేటాను ఈ ముఠా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తుందని వెల్లడించారు. కీలక డేటాను విక్రయించడం దేశ భద్రతకు ముప్పు అని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మహిళల వ్యక్తిగత డేటాను కూడా ఈ ముఠా విక్రయించిందని వివరించారు. నిందితుల్లో క్రెడిట్ కార్డులు జారీ చేసే ఎజేన్సీ ఉద్యోగి కూడా ఉన్నారన్నారు.

ఆర్మీలో పనిచేసే రెండున్నర లక్షల మంది డేటాను నిందితులు చోరీ చేశారని పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. దేశంలో 140 రంగాలకు చెందిన 16 కోట్ల 80 లక్షల మంది వ్యక్తిగత డేటాను పోలీసులు చోరీ చేశారని స్టీఫెన్ రవీంద్ర వివరించారు. ఆరు బ్యాంకులకు చెందిన కోటి పదిలక్షల మంది డేటా చోరీకి గురైందన్నారు. ఇన్సూరెన్స్, లోన్స్ కోసం ధరఖాస్తు చేసుకున్న 4 లక్షల మంది డేటాను నిందితులు చోరీ చేశారని తెలిపారు.

 Read Also: చంద్రబాబుకు ముందు నుంచి మైండ్ గేమ్ ఆడటం అలవాటు: మంత్రి అమర్నాథ్

 Follow us on:   Youtube   Instagram

Latest Articles

మత్స్యకారుల జీవితాలను ప్రతిబింబించేలా ‘సముద్రుడు’

కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధా వత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ "సముద్రుడు". అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.. ఈ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్