స్వతంత్ర వెబ్ డెస్క్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాన మంత్రే సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండటం లేదని పేర్కొన్న కేజ్రీవాల్.. ఈ మేరకు ప్రధాని మోడికి ఆయన లేఖ రాశారు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రజలు అడుగుతున్నారని మండిపడ్డారు. దేశంలో సహకార సమాఖ్య అపహాస్యం అవుతున్నప్పుడు.. నీతి ఆయోగ్ భేటీ వల్ల ప్రయోజనం ఎవరికీ ఉంటుందని ప్రశ్నించారు.అయితే ఇప్పటికే నీతి ఆయోగ్ భేటీని పలువురు ముఖ్యమంత్రులు మమత బెనర్జీ, భగవంత్ మాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే.