35.2 C
Hyderabad
Friday, March 29, 2024
spot_img

ఈసారి కఠినంగా సివిల్స్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష..

స్వతంత్ర వెబ్ డెస్క్: సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో హైదరాబాద్‌, వరంగల్‌.. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో ఈ పరీక్ష జరిగింది. అయితే గత కొన్నేళ్ల ప్రశ్నపత్రాలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి కఠినంగా ఉందని అభ్యర్థులు, నిపుణులు తెలిపారు. ఉదయం జరిగిన జనరల్‌ స్టడీస్‌ పేపర్‌లో కరెంట్‌ అఫైర్స్‌పై 13, ఎకనామిక్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌పై 11, చరిత్రపై 12, జనరల్‌ సైన్స్‌పై 3, ఇండియన్‌ పాలిటీ అండ్‌ గవర్నెన్స్‌పై 17, ఎన్విరాన్‌మెంట్‌పై 20, భూగోళ శాస్త్రంపై 15, జీకేపై 9 మరికొన్ని ఇతర అంశాల నుంచి ప్రశ్నలు వచ్చాయని నిపుణులు తెలిపారు.

ఇక మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2 (సీశాట్‌) కొంత సులభంగా ఉందని, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కూడా సులువుగా రాసేవిధంగా ఉన్నట్లు తెలిపారు. ఈసారి కటాఫ్‌ మార్కులు తగ్గే ఛాన్స్‌ ఉందని అభిప్రాయపడ్డారు. జూన్‌ 15 నాటికి ఈ పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉందన్నారు. సివిల్స్‌లో ఈసారి 1105 ఖాళీలు భర్తీ చేయనున్నారు.

Latest Articles

‘ఫ్యామిలీ స్టార్’ను కొన్నేళ్ల పాటు గుర్తుంచుకుంటారు: డైరెక్టర్ పరశురామ్

సకుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించేలా సినిమాలు రూపొందించడం కొందరు దర్శకులకే సాధ్యమవుతుంది. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి కుటుంబ కథా చిత్రాలతో సూపర్ హిట్స్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్