Site icon Swatantra Tv

దివంగత సీఎం వైఎస్సార్‌కు నివాళులర్పించిన నారా లోకేశ్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా ఆత్మకూరులోని నల్లకాలువ వద్ద డాక్టర్ వైఎస్ఆర్ స్మృతివనం వద్దకు పాదయాత్ర రాగానే దివంగత సీఎం వైఎస్సార్‌కు లోకేశ్ నివాళులర్పించారు. మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఇతర టీడీపీ నాయకులు వైఎస్సార్ స్మృతివనం గురించి వివరించగా.. లోకేశ్ రెండు చేతులెత్తి నమస్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పార్టీలు వేరైనా దివంగత నాయకుడికి లోకేశ్ గౌరవం ఇవ్వడంపై టీడీపీతో పాటు వైసీపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version