Site icon Swatantra Tv

జగన్‌ చేసిన ట్వీట్‌పై నారా లోకేశ్‌ కౌంటర్

హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు. రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటిందన్నారు.. కూటమి ప్రభుత్వం అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించి వేస్తోందని తెలిపారు. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్.. అసత్య ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

శవ రాజకీయాలు చేసే విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని.. ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని… ఏ ఘటననూ ఉపేక్షించేదిలేదని స్పష్టంచేశారు… ఏ నిందితుడినీ వదిలేది లేదని… బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదన్నారు… ఇది భయపడే ప్రభుత్వం కాదని.. . ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమిదని స్పష్టంచేశారు మంత్రి నారా లోకేశ్‌.

Exit mobile version