నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఖరారయింది. మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయనున్నారు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. హనుమాన్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వెండితెరకు పరిచయం కాబోతున్నాడు మోక్షజ్ఞ. ఇవాళ మోక్షజ్ఞ పుట్టిన రోజు కానుకగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. క్యూట్ లుక్‌లో సింపుల్‌గా నడుచుకుంటూ చిన్న సింహం మాదిరి కనిపిస్తున్న మోక్షజ్ఞ లుక్ అదరగొట్టింది. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్‌తో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాశం ఉండబోతున్నట్టు సమాచారం. SLV బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.