ఏపీ సీఎం చంద్రబాబును గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ నాదిర్ గోద్రెజ్ కలిశారు. కేంద్ర ప్రాయోజిత పథకం NMEO ఓపీ రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరు పట్ల ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో 2 వేల 800 కోట్ల పెట్టుబడులపై కీలక చర్చలు జరిగాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి, విశాఖపట్నంలో పురుగుమందుల తయారీపై చర్చించామని వెల్లడించారు. రొయ్యల మేత, ఆయిల్ పామ్ సాగుపైనా చర్చలు జరిగాయని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పురోగతి దిశగా చర్చలు సంతృప్తికరంగా సాగాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.